15, డిసెంబర్ 2010, బుధవారం

" శుక్లాంబరధరం విష్ణుం "

ముందెన్నడో చేయవలసిన ప్రార్థన.....ఇప్పటికి చేస్తూన్నాను......సరే....విఘ్ననాయకు డనుగ్రహిస్తాడనే నమ్మకం!!!

సతతావిఘ్న మహాప్రసాదమునకై , శ్లాఘించెదన్ వ్యాస భా
రత సత్కావ్య విలేఖకున్ ; గజముఖున్ ; ప్రజ్ఞా యశః కారకున్ ;
తత దీవ్యద్గణ నాయకున్ ; మహిత భక్త క్లేశ విధ్వంసకున్ ;
శ్రిత సంసేవక మూషికున్ ; సుకవితా శ్రీ భావ సంధాయకున్!!!!!

వ్యాస భారత విలేఖనా భార దురంధరుడూ , గజ ముఖుడూ , వేడినంతనే అమితమైన బుద్ధి , అంతులేని కీర్తులని ప్రసాదించేవాడూ , పెక్కు గణములకు అధినాయకుడూ , భక్తుల మహా క్లేశాలను విధ్వంసం చేసే వాడూ , ఎల్లప్పుడూ తనకు ఆశ్రితుడై సేవకుడైన మూషికుని కలిగియుండేవాడూ , సత్కవిత్వ భావనలనే సంపదనొసంగగలిగే వాడూ అయిన ఆ విఘ్నేశ్వరుని ఎల్లప్పుడూ ' అవిఘ్న సిద్ధి ' అనే మహా ప్రసాదం కొరకు ప్రార్థిస్థాను !!!!

3 కామెంట్‌లు:

  1. బాలు మంత్రిప్రగడ15 డిసెంబర్, 2010 7:37 PMకి

    డా. విష్ణు గారూ,
    ఆ విఘ్నేశ్వరుడు సదా మీకు ' అవిఘ్న సిద్ధి ' ప్రసాదించాలని ఆశిస్తూ
    - బాలు మంత్రిప్రగడ

    రిప్లయితొలగించండి