17, ఫిబ్రవరి 2015, మంగళవారం

ఓం నమశ్శివాయ !

కాల కాలాయ శ్రీకంఠాయ శంభవే 
***** భవ నాశకాయ తుభ్యం నమామి 
నగజాధిపాయ పన్నగ భూషణాయ భ
***** స్మాంగరాగాయ తుభ్యం నమామి
ప్రమథాధినాథాయ త్ర్యంబకాయ హరాయ 
***** ఫాల నేత్రాయ తుభ్యం నమామి
సోమాయ రుద్రాయ భీమాయ శూలినే 
***** వామదేవాయ తుభ్యం నమామి 

కాల రూపాయ దివ్య గంగాధరాయ 
శంకరాయ గిరీశాయ శాశ్వతాయ 
సిద్ధ సాధకాయ సుధాంశు శేఖరాయ 
ప్రత్యయాయ శర్వాయ తుభ్యం నమామి !!!