19, ఆగస్టు 2015, బుధవారం

జగద్గురు శ్రీ భారతీ తీర్థ స్వామి - నమామి
( సాక్షాత్తూ పీఠాధిపతుల మ్రోల నిలిచి , చదివి - వారిచే ' పండిత సత్కారం ' అందుకున్న శ్లోక పంచకం )


యస్యామలాననాంభోజం
సరస్వత్యాలయం సదా 
తస్యాంఘ్రి యుగళం వందే
భారతీ తీర్థ సద్గురోః !!

( ఎవరి నిర్మలమైన ముఖ కమలమైతే సరస్వతీ దేవికి నిత్య నివాసమై చెలువొందుతుందో ఆ భారతీ తీర్థ సద్గురు పాద యుగళానికి నమస్కరిస్తున్నాను )

వ్యాఖ్యా సింహాసనాధీశః
శంకాద్రి భిదురోపమః
పాతున స్సర్వ పాపేభ్యః 
కరుణా వరుణాలయః !! 

( వ్యాఖ్యా సింహాసనాన్ని అధిరోహించి , శంకా పర్వతాల పాలిటి వజ్రాయుధమై ,అపార కరుణా సాగరులైన భారతీ తీర్థ స్వామి సకల పాపముల నుండి మమ్ము రక్షింతురు గాక ! )


వేద వేదాంత తత్వఙ్ఞం
శారదా పీఠ సంస్థితం 
సర్వఙ్ఞం జగదాచార్యం
భారతీ తీర్థమాశ్రయే !!

( వేద వేదాంత తత్వమునెల్ల తెలుసుకున్న వారు , శృంగగిరి శ్రీ శారదా పీఠాధినేతృత్వం వహించే వారు , సర్వఙ్ఞులు , జగద్గురువులైన శ్రీ భారతీ తీర్థ స్వామిని ఆశ్రయిస్తాను )

యేన బోధేన దేశోయం 
సుభిక్షేణాభివర్థతే 
భారతీ తీర్థ యోగీంద్రః 
స ఏవ శరణం మమ !!

( ఎవరి ప్రబోధం వలన ఈ దేశం సుభిక్షంగా వర్థిల్లుతున్నదో ఆ శ్రీ భారతీ తీర్థ స్వాములే నాకు శరణం )


ఙ్ఞానాత్మనే సకల శాస్త్ర విదాంవరాయ 
కారుణ్య భావ నిధయే శ్రిత వత్సలాయ 
సౌమ్యాయ శుద్ధ మతయే మహిమాలయాయ  
మాయాంతకాయ చ జగద్గురవే నమస్తే !! 

( ఙ్ఞాన స్వరూపులు , సకల శాస్త్ర విదాంవరులు , కరుణా స్వభావులు , ఆశ్రిత వత్సలులు , సౌమ్యులు , విశుద్ధ మతి కలిగినవారు , మహిమ సంపన్నులు , మాయను దూరం చేయగలిగిన వారు అయిన జగద్గురు శ్రీ భారతీ తీర్థ స్వామికి నమస్సులు )

17, ఫిబ్రవరి 2015, మంగళవారం

ఓం నమశ్శివాయ !

కాల కాలాయ శ్రీకంఠాయ శంభవే 
***** భవ నాశకాయ తుభ్యం నమామి 
నగజాధిపాయ పన్నగ భూషణాయ భ
***** స్మాంగరాగాయ తుభ్యం నమామి
ప్రమథాధినాథాయ త్ర్యంబకాయ హరాయ 
***** ఫాల నేత్రాయ తుభ్యం నమామి
సోమాయ రుద్రాయ భీమాయ శూలినే 
***** వామదేవాయ తుభ్యం నమామి 

కాల రూపాయ దివ్య గంగాధరాయ 
శంకరాయ గిరీశాయ శాశ్వతాయ 
సిద్ధ సాధకాయ సుధాంశు శేఖరాయ 
ప్రత్యయాయ శర్వాయ తుభ్యం నమామి !!!