17, ఫిబ్రవరి 2015, మంగళవారం

ఓం నమశ్శివాయ !

కాల కాలాయ శ్రీకంఠాయ శంభవే 
***** భవ నాశకాయ తుభ్యం నమామి 
నగజాధిపాయ పన్నగ భూషణాయ భ
***** స్మాంగరాగాయ తుభ్యం నమామి
ప్రమథాధినాథాయ త్ర్యంబకాయ హరాయ 
***** ఫాల నేత్రాయ తుభ్యం నమామి
సోమాయ రుద్రాయ భీమాయ శూలినే 
***** వామదేవాయ తుభ్యం నమామి 

కాల రూపాయ దివ్య గంగాధరాయ 
శంకరాయ గిరీశాయ శాశ్వతాయ 
సిద్ధ సాధకాయ సుధాంశు శేఖరాయ 
ప్రత్యయాయ శర్వాయ తుభ్యం నమామి !!! 

4 కామెంట్‌లు:

  1. సర్ తుభ్యం నమః అని ఉండాలి నమామి అని ద్వితీయ విభక్తి సరికాదేమో.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నమామి అనేది ఉత్తమ పురుష ఏక వచన ధాతువండీ. నమః కు, నమామి కి నమస్కారం కు, నమస్కరిస్తున్నానుకు ఏమి తేడా ఉందో అది మాత్రమే ఉంది.
      ఫలానా వారి 'కొరకు' నమస్కారం అన్నా లేక ఫలానా వారి 'కొరకు' నమస్కరిస్తున్నాను అన్నా ఒకటే.
      కుమార గురవే తుభ్యమర్పయామి సుమాంజలిమ్ అన్న వినాయక వ్రతకల్ప శ్లోకాన్ని విషయ గ్రాహ్య సౌలభ్యం కొరకు గుర్తు చేస్తున్నాను.

      తొలగించండి