తెలుగు సాహిత్య జగతికి సెలవటంచు
మరలిపోయెను మా శాస్త్రి గురువరుండు.
కటకటా! భువి కారుచీకటుల నలది
దినకరుండస్తమించె! దుర్దినము నేడు!
ధీ ప్రభలతోడ నఙ్ఞాన తిమిరములను
ద్రోలు దినకర బుధుడు వీడ్కోలు పలుక
నాంధ్ర సారస్వతావని నావరించె
పెను నిరాశాభ్రమొండు! దుర్దినము నేడు!
(మేఘచ్ఛన్నంతు దుర్దినమ్)
శతాధిక గ్రంథ కర్త, కవి పండితుడు, మహోపాధ్యాయ, నంద్యాల నివాసి శ్రీ గొట్టిముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి (కలం పేరు-దినకర్) మహోదయులు పరమపదించిన వేళ. 🙏.