1, జనవరి 2011, శనివారం

స్వాగతమో నూత్న వత్సరమ్మ !

* శ్రీకరమై ; సజ్జన సౌ
  ఖ్యాకరమై ; నూత్న వత్సరాది - శుభాశీః
  ప్రాకట సంపద బ్రోచుత
  లోకావళి సత్కృపా విలోకనవతియై !

* కోటి ఆశల మోసికొని వేగ రావమ్మ
    స్వాగతమో నూత్న వత్సరమ్మ!
  క్రొత్త ఆశయ సిద్ధి గూర్పగా రావమ్మ
    స్వాగతమో నూత్న వత్సరమ్మ !
  వీలయినంతలో మేలు జేయగదమ్మ
    స్వాగతమో నూత్న వత్సరమ్మ !
  కడగండ్ల కన్నీళ్లు అడుగంటవలెనమ్మ
    స్వాగతమో నూత్న వత్సరమ్మ !

 కలతలన్నింటినింక పోకార్చవమ్మ !
 నలతలన్నింటినింక దున్మాడవమ్మ !
 కొరత లేకుండ క్షేమమ్ము గూర్పవమ్మ !
 తలతు నిన్నింక ! దయతోడ మెలగవమ్మ !!!

7 కామెంట్‌లు:

  1. ఆప్తుల యోగక్షేమాలే ఆనందదాయకం ఆత్మీయులను తలచుకొనడం పండుగనాడు విధాయకం అందుకే ఈ పర్వదిన శుభ సమయంలో ఆయురారోగ్యభాగ్యాలు పెరగాలీ ఇతొధికం.
    నూతన సంవత్సర శుభాకాంక్షలతొ ధరణీ రాయ్ చౌదరి

    రిప్లయితొలగించండి
  2. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
    సూర్యనారాయణ ("స్వగతం")

    రిప్లయితొలగించండి
  3. @ ధరణీరాయ్ చౌదరి గారు
    @ యస్ ఆర్ రావు గారు
    @ సూరి వులిమిరి గారు

    ధన్యవాదాలు.........హృదయపూర్వక నూతనాంగ్ల సంవత్సర శుభాకాంక్షలు !!!

    రిప్లయితొలగించండి
  4. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు!

    రిప్లయితొలగించండి
  5. నవ్య వసంతం మీ కుటుంబంలో నూతన కాంతులు నింపాలని కోరుకుంటూ ....మల్లిశ్రీ

    రిప్లయితొలగించండి
  6. డాక్టర్ గారూ,
    మీకూ, మీ కుటుంబానికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.
    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం & కుటుంబం

    రిప్లయితొలగించండి
  7. @ మంద పీతాంబర్ గారు
    @ జగ్గంపేట గారు
    @ బాలు గారు

    ధన్యవాదాలు ....ఈ కొత్త సంవత్సరం మీ జీవితాల్లో , మీ మీ కుటుంబాల్లో సంతోషాన్నీ , వెలుగులనూ నింపాలని......యివే శుభాకాంక్షలు.......ధన్యవాదాలు.....

    రిప్లయితొలగించండి