15, ఫిబ్రవరి 2011, మంగళవారం

ఇద్దరూ ఇద్దరే !!!

వానరాణాం వివాహేషు
తత్ర గార్దభ గాయకాః
పరస్పరం ప్రశంసంతి
అహో రూప మహో ధ్వనిః !!!


ఇద్దరు విషయ పరిజ్ఞానం లేని వ్యక్తులు పరస్పర ప్రశంసలతో , ఆహా ఓహో అంటూండగా విన్న జగన్నాథ పండిత రాయలు నవ్వుకుని , వారిపై జాలిపడి పలికిన శ్లోకమది .

వానరముల పెండ్లి పండుగలో - మేటి
గాయకాగ్రగణులు గార్దభములు ;
ఎంత మంచి రూప మెంత సుస్వరమంచు
పొగడిరొకరినొకరు పొట్టలుబ్బ !!!
( డా. విష్ణునందన్ )

అర్థం సుగమం.

4 కామెంట్‌లు:

  1. మంచి శ్లోకం. దానికి చక్కని అనువాదం. పొట్టలుబ్బించి ఇంకా రక్తి కట్టించారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  2. శంకరయ్య గారూ , మహా భాగ్యం !!!! మీ ప్రశంసతో , కాస్త విలువ హెచ్చినట్టయ్యింది యీ పద్యానికి ! పరితృప్తోస్మి !!!

    రిప్లయితొలగించండి
  3. డాక్టర్ గారూ!అభినందనలు. సరస మైన శ్లోకములను పరిచయం చేస్తూ తెనిగించటం... మంచి ఆలొచన. ఇంకా కొన సాగాలని ఆకాంక్షిస్తూ...

    గోలి హనుమచ్ఛాస్త్రి.

    రిప్లయితొలగించండి