26, ఏప్రిల్ 2012, గురువారం

వందే లోక శంకరం !!!


కాషాయ వస్త్ర సంకలితోత్తమాంగంబు ;
          తీక్ష్ణ భాను మయూఖ దృక్ప్రశస్తి ;
రుద్రాక్ష మాలా శిరోధి ; దక్షిణ భుజా 
          ధారిత సద్ధర్మ దండ దీప్తి ;
భాష్య కావ్యాన్విత వామ హస్తంబు ; చి
          న్ముద్రాంక దక్షిణామోఘ పాణి ;
వ్యాఘ్రాజినోపరి పద్మాసన స్థితి ;
         సురుచిరాకృతి ; శ్రుతి స్థూల శక్తి ;


సకల విశ్వంభరాధార సంప్రయుక్త 
మహిత సుకృత సంధాన సమ్యగ్యతీశ 
సార్వభౌమ స్వరూపంబు సన్నుతింప 
దమ్మిచూలికి నైన సాధ్యమ్మె జగతి ?! 

6 కామెంట్‌లు:

  1. విష్ణునందనుడైన తమ్మిచూలికి సాధ్యమే! సందేహం లేదు. అందుకు ఈ పద్యమే సాక్ష్యం....

    రిప్లయితొలగించండి
  2. శంకరయ్యగారూ ధన్యోస్మి ! మీకు నా ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. చక్కటి పోస్ట్ ను అందించినందుకు కృతజ్ఞతలండి.

    రిప్లయితొలగించండి
  4. అద్భుతంగా చెప్పారు... ధన్యోస్మి!

    రిప్లయితొలగించండి
  5. ప్రణవ్ గారికి - నమస్కారాలు , కృతజ్ఞతానీకం !!!

    రిప్లయితొలగించండి