23, మార్చి 2012, శుక్రవారం

నందనాఖ్య !


తెలుగు మాట్లాడెడి జిలిబిలి బాలుర
    నొజ్జలు శిక్షింపకున్ననాడు ;
ఇరువురు తెలుగు వారెదురెదురై యాంగ్ల
   మున పల్కరింపుల గొనని నాడు ; 
ఒక తల్లి పిల్లలే వికల మనస్కులై  
    ఒండొరుల్ కలహింపకున్ననాడు ; 
అన్నమ్ము 'రైసు ' గా నా మంచి నీరమ్ము
    ' వాటరు ' గా పిల్వబడని నాడు ;

నాడె నిను మెచ్చుకుందునో నందనాఖ్య !
నాడె నిను సంస్తుతింతునో నందనాఖ్య !
నాడె నిను గూర్చి నయమైన నవ్య పద్య
చందన విలాసమును గూర్తు నందనాఖ్య !!!

నందనము సకల భువి కా
నందమ్మును గూర్చి జన గణంబుల చేతో
మందిరముల సుఖ శాంతుల 
నందమ్ముగ నింపుననుచు నాశంసింతున్ !!! 


 

 

3 కామెంట్‌లు:

  1. శ్రీయుతులు డా. విష్ణు నందన్ గారికి,
    ముందుగా మీకు కూడా "శ్రీ నందన నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు".
    చక్కని ఆకాంక్ష. మీ పద్యములు, తదంతర్గత భావము చాలా బాగున్నవి.

    రిప్లయితొలగించండి
  2. డాక్టర్ విష్ణునందన్ గారికి
    ంఈ నందనాఖ్య పద్యాలు బాగున్నాయి.
    నాపేరు డ. కోమలరావు ,శ్రీకాకుళం.వృత్తి విరిగిన ఎముకలకు కట్లు కట్టడం .ఖాళీ సమయంలో తెలుగు పదాలు కలిపి పద్యాలు కట్టడం
    అభిరుచి
    నా బ్లాగ్ .తెలుగులెస్స. krbaruva .blogspot

    రిప్లయితొలగించండి
  3. మూర్తిగారూ ధన్యవాదాలు !

    డా.కోమలరావు గారూ , మీ 'పద్యాలు ' బాగున్నాయి , కొంచెం యతుల విషయం లో జాగ్రత్త వహిస్తే మరింత బాగుంటాయి . కృతజ్ఞతలు !

    రిప్లయితొలగించండి