6, నవంబర్ 2011, ఆదివారం

దుర్లక్షణం

మంచిని జెప్పుచో సుగుణ మాన్యుడు సమ్మతి దెల్పు ; మధ్యముం
డంచిత మౌన భావ యుతుడై తొలగున్ దెరచాటు శీఘ్రమే ;
కొంచెపు బుద్ధితో మెలగి గొంటుదనమ్మున వాదమూని గ
ర్వించును గాదె నీచుడు ; ధరిత్రి మనుష్యులు పెక్కు భంగులున్ !


ఈ మధ్య - ఒక పవిత్రమైన స్థలి లో , జరిగిన ఒకానొక సంభాషణా శ్రవణ కారణ సంజనితము . పిలవని పేరంటానికి వచ్చి ,  నీ పేరంటం నాకు నచ్చలేదు , పేరంటం వెంటనే ఆపేయమనడమూ , నచ్చజెప్పబూనితే తిరస్కార ధోరణి లో మాట్లాడడమూ - లోకం లోని వివిధ మానసిక జాడ్యాలలో ఇదీ ఒకటి కాబోలు ! 
 

2 కామెంట్‌లు:

  1. విష్ణు నందన్ గారూ బాగా చెప్పారు. వర్తమాన కాల పరిస్థితి ఇలాగే ఉంది. ఇలాటివన్నీ తెలిసే లేదా ఊహించే ఆనాడే భర్తృహరి ఇలాటి వారిని గూర్చి చెప్పాడు. ఆ మహా కవిని గుర్తుకు తెచ్చారు. అందుకే పెద్దలంటారు.
    పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అని. మంచి పద్యం. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి