13, నవంబర్ 2011, ఆదివారం

పెండ్లి

అగ్ని సాక్షిగ - వేద మంత్రాన్వితముగ
మధుర మంగళ తూర్య సమాహితముగ
నంగరంగ వైభవముగా నతిశయిల్లు
పెండ్లి - బంధు మిత్రుల కనువిందు నేడు !

అనురాగమ్మనుకూల వర్తనము - గాఢాకర్షణాన్యోన్య భా
వనమే పెండిలి - నిత్య సత్యము , మహాద్వైత ప్రబోధమ్మగున్ !
తనువుల్ రెండగు నంతరాత్మ యొకటై తాదాత్మ్యమున్ జెందు నీ
ఘన వైవాహిక బంధమే మహిత యోగంబౌను ధాత్రీ స్థలిన్ !!! 

రాబోయే ఒకానొక పెండ్లికి వధూవరులకిచ్చిన ఉపదేశం లాంటి సందేశం !!!

2 కామెంట్‌లు:

  1. డా.విష్ణందన్ గారూ ,మీ పద్యాలు చాలా బాగున్నవి.నా 'మహనీయం 'కావ్యసంపుటిలో కళ్యాణవేదిక శీర్షికలో రాసిన పద్యాల్లో ఒకటి ఇస్తున్నాను.
    అతి మనోహర సుమ మాలికాభి రామ
    వర్ణ దీపికా లంకృత ,వాస్తుశిల్ప
    రచిత కళ్యాణ మంటప రంజితమ్ము
    చందనాగురు ,పన్నీటి గంధయుతము,
    రమ్యమగు హైందవ వివాహ ప్రాంగణమ్ము.

    రిప్లయితొలగించండి
  2. కమనీయం గారూ , ధన్యవాదాలు - మీ హైందవ వివాహ ప్రాంగణ శోభలు చాలా బాగున్నవి !!! ఆలస్యమైన ప్రతిస్పందనకు క్షంతవ్యుడను !!!

    రిప్లయితొలగించండి