వ్యాసుడు , కమ్ర కవిత్వ వి
భాసుడు , శతకోటి సూర్య భాస్వరుడు , శుభా
వాసుడు , సంతత హరిపద
దాసుడు ప్రత్యక్షమయ్యె దరహాసముతో
కమనీయ సితవర్ణ కబరీ భరమ్ముతో
ధూర్జటి బోలు నస్తోక సుగుణు ;
నిగమాగమోక్తి స్వనించు నెమ్మోముతో
జతురాస్యు బోలు సంసార తరణు ;
మాయా నికృంతన మహిత తేజముతో హృ
షీకేశు బోలు రాజీవ నయను ;
జ్ఞాన వీచీయుత మానసార్ణవముతో
దేవర్షి బోలు నాస్తిక్య హరణు ;
విష్ణు సేవా ప్రవణు ; భక్తి విధి విహరణు ;
భాగవత కథాకథన విభ్రాజమాను ;
తత భవలతా నిశిత లవిత్రాయమాను ;
బాదరాయణు తాపసాభరణు గొలుతు !!!
( త్రిమూర్తులకూ , దేవర్షి యైన నారదునికి - వ్యాసునితో పోలిక గల్పించుట
"కబరీభరమును" పోల్చాలి కాబట్టి - శివుడు 'ధూర్జటి ' యైనాడు , 'నెమ్మోము ' ను వర్ణించాలి కాబట్టి బ్రహ్మ 'చతురాస్యుడై ' నాడు , 'మాయా విచ్చేదకమైన ' ఇంద్రియేశ్వరత్వము ఉపమేయము కాబట్టి విష్ణువు 'హృషీకేశు ' డైనాడు . 'నారదుడు ' వ్యాసుడు ' ఇరువురూ ' "జ్ఞాన" వీచీయుత మానసులే నని సామ్యము . )
చాలా బాగుందండి...
రిప్లయితొలగించండివ్యాసుని వర్ణన...
@శ్రీ
good one
రిప్లయితొలగించండిశ్రీ గారు , మనోహర్ చెనికల గారు - చాలా చాలా ధన్యవాదాలు !!!
రిప్లయితొలగించండి