10, మార్చి 2018, శనివారం

విభూషణం మౌనం పండితానాం

ఎవడికి వాఁడె పండిత కవీంద్రుఁడు వానిదె సత్కవిత్వమౌఁ
జెవినిడఁబోడు మంచి చెడు సెప్పినచోఁ బరుషమ్ములాడి కై
తవమును జూపు కాలమిది- తప్పులనొప్పుల నెంచకుంటయే
మివుల ముదావహమ్మగును- మేలగు మౌనమె యీ పరిస్థితిన్ !

3 వ్యాఖ్యలు: