యస్యాననాంభోరుహ దివ్య దర్శనాత్
శ్రితస్య హృద్వ్యోమ తలే విరాజతే
ఙ్ఞానారుణ: తద్విధుశేఖరస్య చ
సమ్యక్కథాం చేతసి భావయామ్యహమ్!
ఎవరి ముఖ కమల దర్శనమాత్రం తోనే ఆశ్రితుల హృదయాకాశంలో ఙ్ఞానమనే భాస్కరుడు ఉదయిస్తాడో అటువంటి యతీశ్వరుని సచ్చారిత్రమును మనస్సులో స్మరిస్తాను.
మామూలుగా సూర్యుని చూచి కమలం వికసించినట్లు వర్ణించడం కవి సమయం కానీ అత్యంత నిర్మలమైన, ప్రసన్నమైన యతీశ్వరుని ముఖాన్ని సూర్య బింబంతో పోల్చడమెలా అని, ముఖాన్ని కమలంతోనూ, ఆ ముఖ దర్శనంతో వెలుగు కు ప్రతీకాశమైన ఙ్ఞానమనే సూర్యుడు విలసిల్లినట్లు వ్యత్యస్తాలంకారం పాటించబడినది.
(పరమహంస పరివ్రాజకాచార్య పూజ్య శృంగేరీ జగద్గురు శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతి స్వామి వారి సమక్షంలో, గుంటూరులో).